Studio18 News - ANDHRA PRADESH / : ఎస్సీ వర్గీకరణను దక్షిణాది రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు వెంటనే స్వాగతించారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ సాకారంలో నరేంద్రమోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందన్నారు. సహకరించిన ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అమలుకు అన్ని రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే దానిని అమలు చేయాలన్నారు. వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాలు కూడా వెంటనే అమలు చేసేలా ప్రధాని మోదీ సూచించాలని కోరారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పినందుకు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా చాలా పేదకుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Studio18 News