Studio18 News - ANDHRA PRADESH / : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయవాడ, ఏపీలోని ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలు, రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడలో అధికారులతో సమావేశమవుతారు. నష్టం అంచనాపై అధికారులతో చర్చిస్తారు. రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. రైతులను, బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వనున్నారు.
Admin
Studio18 News