Thursday, 12 March 2026 04:16:58 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Balineni Srinivasa Reddy : ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు నేడు మాక్ పోలింగ్..

Date : 19 August 2024 11:42 AM Views : 341

Studio18 News - ANDHRA PRADESH / : Mock Polling In EVMs : ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌ల‌లోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది. ఇవాళ ఉదయం 10గంటలకు ఒంగోలు లోని భాగ్యనగర్ లో ఉన్న ఈవీఎంల గోదాములో మాక్ పోలింగ్ ను బెల్ సంస్థ ప్రతినిధులు నిర్వహించనున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంల తీరుపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీమంత్రి, ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రీ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ సీఈసీకి బాలినేని విజ్ఞప్తి చేశారు. బాలినేని విన్నపానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇందుకోసం అయ్యే ఫీజును ఇప్పటికే బాలినేని కేంద్ర ఎన్నికల సంఘానికి చెల్లించారు. బాలినేని ఈవీఎంలపై వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సిద్దమవుతున్నారు. రీ మాక్ పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రీ మాక్ పోలింగ్ నిర్వహన తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ హైదరాబాద్ లో ట్రైనింగ్ పొందారు. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన 26మంది అభ్యర్థులకు కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సమాచారం అందించారు. రోజుకు మూడు ఈవీఎంల చొప్పున నాలుగు రోజులపాటు రీ మాక్ పోలింగ్ ప్రక్రియను జరగనుంది. ఈ ప్రక్రియను భూసేకరణ విభాగపు ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మీ పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో చేపట్టనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :