Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో భారీ వర్షాల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. గత రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మునుపటి మాదిరి స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. కేవలం 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు ఐదు కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. అటు టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) దర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వచ్చింది.
Admin
Studio18 News