Studio18 News - ANDHRA PRADESH / : అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ గవర్నర్ కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ ఈవోగా కూడా ఆయన పని చేశారు. ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగిన నిమ్మగడ్డ తాజాగా అదే సంస్థ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.
Admin
Studio18 News