Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని శివాపురం వద్ద ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ సొంత ఇంటి నిర్మాణ పనులను చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు పర్యవేక్షించారు. పనులు సాగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను అడిగిఈ వివరాలు తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ కు ఆమె పలు సూచనలు చేశారు. చంద్రబాబుకు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోట. ఆయన ఇక్కడ్నించి వరుసగా ఎనిమిదిసార్లు విజయభేరి మోగించారు. అయితే, సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శలకు అడ్డుకట్టవేయాలని భావించి ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు.
Admin
Studio18 News