Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… సీఎంగా ఉన్న వ్యక్తి ధర్మం, న్యాయాలను పరిరక్షించకపోతే ఈ పదాలకు అర్థమే ఉండదని చెప్పుకొచ్చారు. తాము అదే స్థానంలో ఉంటే హుందాగా వ్యవహరించేవాళ్లమని తెలిపారు. పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలకు పూర్తిగా గండికొట్టారని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి మనం పలావు పెట్టామని, కాని చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారని చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని అన్నారు. ప్రజలు మళ్ల పస్తులతో ఉండాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలతో ఎన్నికల ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యిందని చెప్పారు. ఈ రెండు నెలల కాలంలోనే విపరీతమైన వ్యతిరేక వచ్చిందని తెలిపారు. స్కూళ్లు నాశనం అయిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు ఉంటాయా? లేవో? అన్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి కూడా అంతేనని అన్నారు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయని చెప్పారు. అబద్ధం, అవాస్తవం అనేవి ఎప్పుడూ నిలబడవని అన్నారు. చంద్రబాబు అబద్ధాల వల్ల ఆయనకు అధికారం వచ్చిందని తెలిపారు. ఐదేళ్ల పాలనలో క్యాలెండర్ పెట్టి మరీ ప్రతి ఇంటికీ పథకాలు అందించామని అన్నారు.
Admin
Studio18 News