Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్‌షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నారు. కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందించనున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత కొద్దిరోజులుగా వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. వారు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరతారని సమాచారం. వారిద్దరితోపాటు మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు త్వరలో ఆ పార్టీని వీడబోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Admin
Studio18 News