Monday, 02 December 2024 01:04:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Janasena: అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు

Date : 29 August 2024 11:01 AM Views : 35

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుండి అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు. జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేశ్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అల్లు అర్జున్ .. నీవు హీరో ననుకుంటున్నావా.. కమేడియన్ వి మాత్రమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు' అంటూ రమేశ్ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మహావృక్షం లాంటి వాడని అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి అని అన్నారు. నువ్వు (అర్జున్) నీడను ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావంటూ దుయ్యబట్టారు. 'నీ బాబు అల్లు అరవింద్, నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనటువంటి వాళ్లు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో.. నువ్వేమిటో ముందు చూసుకో అని హితవు పలికారు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. డిసెంబర్ నెలలో విడుదల అవుతున్న నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా అడుతుందో చూపిస్తానని శపథం చేశారు. ఇక్కడ నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్లు కూడా ఎవరూ లేరని రమేశ్ బాబు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు