Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు. నిన్న వేంపల్లి మండలంలో టీడిపి నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త సతీష్ రెడ్డి అనుచరుడు అజయ్ రెడ్డిని కడప రిమ్స్ ఆసుపత్రిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఎన్నికలు ఐపోయినా తర్వాత దాడులు చేసే సంప్రదాయం పులివెందులలో ఎప్పుడు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక భయాందోళన సృష్టించడానికి దాడులు చేసి ఏమి సాధిస్తారని జగన్మోహన్ రెడ్డి తెదేపా నేతలను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలన్నారు. ఎల్లకాలం చంద్రబాబునాయుడు అధికారంలో ఉండరని, అధికారం మారిన రోజున చంద్రబాబు నాయుడు చేస్తావున్న చెడు సాంప్రదాయం తిరిగి చుట్టుకుంటుందన్నారు. టీడిపి ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం,పెన్షలు సారిగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు ఏవి సరిగ్గా జరగడం లేదని, వ్యవస్థలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుదే అన్నారు.
Admin
Studio18 News