Studio18 News - ANDHRA PRADESH / : భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం- కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ-ఛత్తీస్ గఢ్-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Admin
Studio18 News