Friday, 13 December 2024 08:44:52 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

USA: అమెరికాలో విషాదం.. మరో తెలుగు విద్యార్థి మృత్యువాత

Date : 29 August 2024 11:23 AM Views : 32

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కారణాలు ఏమైనప్పటికీ అమెరికాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉంటున్నారు. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి జీవితం విషాదాంతమైంది. ఎన్నో కలలు, లక్ష్యాలతో అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి అనే 26 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ ప్రమాదంలో ఓ లేక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన అతడు.. తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం సమీపంలో ఉండే జార్జ్‌ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో బోటుపై అందరూ సరదాగా గడిపారు. అయితే లేక్ మధ్యలో ఉన్న ఓ రాయిపైకి ఎక్కిన రూపక్ రెడ్డి ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ అతడు పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. బోటులో ఉన్న అతని ఫ్రెండ్స్ రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సరస్సులో నుంచి మృతదేహాన్ని వెలికితీసింది. డెలవేర్‌లోని హారిస్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో రూపక్ రెడ్డి ఎంఎస్‌ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 8 నెలల కిందటే అతడు అమెరికా వెళ్లాడని చెప్పారు. కాగా రూపక్ రెడ్డి మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు