Wednesday, 10 December 2025 01:39:14 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కిలారి రోశయ్య గుడ్ బై

Date : 24 July 2024 02:22 PM Views : 256

Studio18 News - ANDHRA PRADESH / : Kilari Venkata Rosaiah: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ”వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస గౌరవం కూడా నాకు లభించలేదు. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి గౌరవించారు. పార్టీలో గ్రూపులు తయారు చేసినవారు ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. చెప్పుడు మాటలు విని అధినేత నాకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదు. అన్నివిధాలా నేను పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నాను. సమాజంలో విలువ లేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారు. ఎంతో అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. కొందరు పెద్దల సొంత నిర్ణయాలతోనే పార్టీని నడిపిస్తున్నారు. భవిష్యత్తు కారాచరణ కోసం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాన”ని చెప్పారు. కాగా, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి ఇటీవల వైసీపీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :