Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపిస్తున్నాడే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. "రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు... ఎవరీ రషీద్? చంపినవాడెవడు? చచ్చినవాడెవడు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? సరే అది అయిపోయింది... 36 మంది చనిపోయారని గవర్నర్ వద్దకు వెళ్లావు... ఆ 36 మంది పేర్లు ఇవ్వండి. రషీద్ అనే వ్యక్తిని చంపినవాళ్లను అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నీజాయతీ ఉంటే ఆ పేర్లు ఇవ్వు... గతంలో నువ్వు చంపిన వాళ్ల పేర్లు నేనిచ్చాను... ఇప్పుడు వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటా... మళ్లీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తాం... ఇవాళ నువ్వు చెబుతున్న వాటిపై కూడా నేను చర్యలు తీసుకుంటా... సిద్ధమా అని సవాల్ విసురుతున్నా. మాయ మాటలు మాట్లాడకు... దొంగ ఏడుపులు వద్దు... నంగి మాటలు వద్దు. తప్పు చేస్తే మా పార్టీ వాళ్లను కూడా శిక్షిస్తానని చెప్పాను. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం కాదు. ఆ ముసుగు తీస్తాం... నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Admin
Studio18 News