Sunday, 08 February 2026 10:17:49 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Andhra Pradesh: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసే గ్యాంగ్‌లు ఏపీలోనే ఎక్కువట!

Date : 10 August 2024 12:48 PM Views : 292

Studio18 News - ANDHRA PRADESH / : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి వేలాది రూపాయలను కాజేస్తున్న ఏజంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ రకం మోసాలపై లోక్‌సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీలో భారీగా మోసాలు జరుగుతున్నాయని, గత నాలుగేళ్లుగా ఇవి ఎక్కువగా నమోదు అయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ తరహా ఫిర్యాదులను ఏపీ పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదని వివరించింది. విదేశాలలో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కూడా ఈ నాలుగేళ్లలోనే ఎక్కువగా పెరిగారని తెలిపింది. దేశ వ్యాప్తంగా 3,042 మంది నకిలీ ఏజెంట్లు ఉంటే వారిలో అత్యధికంగా 498 మంది ఒక్క ఏపీలోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏపీ తర్వాత యూపీలో 418 మంది, తమిళనాడులో 372, మహారాష్ట్రలో 337, ఢిల్లీలో 299, పంజాబ్ లో 209, కేరళలో 206, తెలంగాణలో 123 మంది అక్రమ ఏజెంట్లు ఉన్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చిన ఫిర్యాదుల వివరాలు చూస్తే 2021లో 1553 నమోదు కాగా, 2022 లో 1227, 2023లో 1006 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ వరకూ 575 విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాలపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పిన విదేశాంగ శాఖ .. ఏపీ నుండి 2021లో 1111, 2022లో 688, 2023లో 445, 2024లో 261 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. తమకు వచ్చిన ఫిర్యాదులను ఆయా రాష్ట్ర పోలీసులకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. ఈ ఫిర్యాదులపై అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంటే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని పేర్కొంది. గత నాలుగేళ్లుగా వచ్చిన ఫిర్యాదులపై ఏపీ పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకూ ఏలాంటి చర్యలు తీసుకోలేదని విదేశాంగ శాఖ వివరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :