Studio18 News - ANDHRA PRADESH / : Former Minister Alla Nani : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి పదవికి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆళ్ల నాని లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Admin
Studio18 News