Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భార్య ఉండగానే రెండో వివాహం కోసం పెళ్లిపీటలపై కూర్చున్న వరుడు.. మొదటి భార్యను చూడగానే అట్నుంచి అటే పరారయ్యాడు. తిరుమలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాకేశ్ అనే వ్యక్తికి వరంగల్ జిల్లా పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్యతో ఇది వరకే వివాహమైంది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో ఉండగానే రాకేశ్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్టు సంధ్యకు ఉప్పందింది. దీంతో ఆమె వెంటనే తిరుమల చేరుకుంది. అప్పటికే పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు రాకేశ్.. సంధ్యను చూడగానే అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News