Studio18 News - ANDHRA PRADESH / : కడప జిల్లా 168వ నూతన కలెక్టర్ గా లోతేటి శివ శంకర్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన వేద పండితుల వేదమంత్రోత్సవాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లా 168వ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో పాడేరు, సీతం పేటలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించి, వైజాగ్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేయడం జరిగిందన్నారు. అధికారుల సహాయ సహకారాలతో కడప జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు. కడప జిల్లాకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపాల్ సెక్రటరీకి కలెక్టర్ ప్రత్యేక కృతగ్నతలను తెలియజేశారు
Also Read : annamayya : వాహనాలను నడపంలో వేగం వద్దు
ADVT
Admin
Studio18 News