Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Amaravati Farmers : ఏపీ రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని రైతుల ఖాతాల్లోకి త్వరలో నిధులు విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను వచ్చే నెల 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు పొలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ పొలాలు ఇవ్వడంతో వారు పంట నష్టపోయారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు వారికి కౌలు ఇవ్వాలని గతంలో చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించే విషయంపై ఆలోచన చేసింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో.. వారికి మరో ఐదేళ్లు కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కౌలును మరో ఐదేళ్లు ఇవ్వనుంది ప్రభుత్వం. వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి కౌలుకు సంబంధించిన నిధులను జమ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ లో కూడా దీనిపై డెసిషన్ తీసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామని కేబినెట్ భేటీలో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు.
Admin
Studio18 News