Thursday, 12 March 2026 03:38:14 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

AP High Court: హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ శ్రీనివాస్ .. పోలీసులకు నోటీసులు

Date : 20 August 2024 01:48 PM Views : 346

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ హైకోర్టుకు చేరింది. దువ్వాడ కుటుంబ పంచాయతీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ గా మారింది. ఓ పక్క శ్రీనివాస్ భార్య వాణి న్యాయపోరాట దీక్ష కొనసాగిస్తుండగా, శ్రీనివాస్ .. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. భార్య వాణి, కుమార్తె హైందవి ఇంటిపైకి వచ్చి వివాదం చేస్తున్నారని, వారిపై నమోదు చేసిన కేసులో టెక్కలి పోలీసులు దర్యాప్తు చేయడం లేదని కోర్టుకు విన్నవిస్తూ .. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ కోరాడు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి .. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ముందుగా పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అయిదు రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితులు వాణి, హైందవిలకు సెక్షన్ 41(ఏ) నోటీసులు ఇచ్చి విచారణ కోరారని చెప్పారు. మరో పక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్ధాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :