Thursday, 12 March 2026 12:52:38 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: గతంలో ఎప్పుడూ లేదు... ఒక్కరోజులోనే 97.54 శాతం మందికి పెన్షన్లు అందించాం: సీఎం చంద్రబాబు

Date : 02 August 2024 02:52 PM Views : 455

Studio18 News - ANDHRA PRADESH / : నిన్న (ఆగస్టు 1) ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఇవాళ ట్వీట్ చేశారు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ.2,737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పెన్షన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా... కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 97.54 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడించారు. "వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పెన్షన్ ఆ పేదల జీవితాలకు భరోసానిస్తుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే... ప్రభుత్వంలో భాగం, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందేశాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నా రూ.5,300 కోట్లు విడుదల చేసి... వారికి దక్కాల్సిన జీతం 1వ తేదీనే చెల్లించాం. రాష్ట్ర పునర్ నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు, వారి సంక్షేమం గురించి ఆలోచించి, వారికి తగిన గౌరవం ఇచ్చే ప్రభుత్వం మాది. కలిసి కష్టపడదాం... రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం" అంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :