Thursday, 12 December 2024 01:36:29 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Mahesh Babu: తిరుమల కొండకు కాలినడకన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు.. ఫొటో వైరల్

Date : 15 August 2024 11:53 AM Views : 36

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తులు తాము అనుకున్నది జరిగితే నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటుంటారు. ఇందులో సామాన్య భక్తులు మొదలుకొని సినీ, రాజకీయ, వ్యాపార వాణిజ్య ప్రముఖులు ఉంటుంటారు. సాధారణంగా విఐపీలు, వీవీఐపీలు నేరుగా తిరుమల కొండపైకి చేరుకుని బ్రేక్ దర్శనంలో సులువుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. తాజాగా, ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార..తిరుమలకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్రత శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మహేశ్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. వీరు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిధి గృహంలో బస చేసిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు