Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YS Sunitha: దివంగత నేత వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను అమరావతిలో కలిశారు. వివేక హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత చెప్పారు. వివేకా హత్య కేసులో బాధ్యులకు శిక్ష పడేవిధంగా ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా సునీతకు అనిత తెలిపారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. తప్పు చేసిన పోలీసులను కూడా వదిలిపెట్టబోమని చెప్పారు. కచ్చితంగా దోషులకు శిక్ష పేడేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Admin
Studio18 News