Studio18 News - ANDHRA PRADESH / : Ap Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు తెలియజేశారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. గ్రామాల్లో చెరువులను, కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని… మత్స్యకారులకు నష్టం చేసేలా జీవోలు జారీ చేసిందన్నారు. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తీసుకొస్తామన్నారు. అలాగే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. 3 నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తామన్నారు మంత్రి పార్థసారధి. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపేయాలని నిర్ణయించామన్నారు. క్యాబినెట్ నిర్ణయాలు.. * మావోయిస్టు పార్టీపై నిషేధం మరో ఏడాది పొడిగింపు * పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నంబర్ 217, 144 రద్దు * రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం * ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి చాలా తక్కువగా ఉంది * దేశ సగటు 2.1 శాతం అయితే రాష్ట్ర సగటు 1.5 శాతం మాత్రమే ఉంది * యంగ్ జనరేషన్ తగ్గే అవకాశం ఉంది * సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉంది * అందుకే స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయిస్తూ కేబినెట్ తీర్మానం * నూతన వైద్య కళాశాలల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం * సున్నిపెంట పంచాయతీ నుంచి 274 ఎకరాలు తిరిగి జలవనరుల శాఖకు * ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణం * పలు రాష్ట్రాలను సందర్శించి మెరుగైన నూతన మద్యం పాలసీ తయారు చేయాలని కేబినెట్ నిర్ణయం * అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు * అల్పాదాయ వర్గాలకు అందుబాటు ధరలకు నాణ్యమైన లిక్కర్ సరఫరా * పట్టాదారు పాస్ బుక్ లపై ప్రభుత్వ ముద్ర * భూ అక్రమాల వెలికితీతకు నిర్ణయం. రెవెన్యూ అధికారులు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశం * 22 ఏకు సంబంధించిన ఫిర్యాదులకు మూడు నెలల్లో పరిష్కారం * అప్పటివరకు 22ఏ భూముల రిజిస్ట్రేషన్ ఆపుదల * ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ సర్వే రాళ్లపై జగన్ బొమ్మలను చెరిపేయాలని నిర్ణయం- మంత్రి పార్థసారథి ”ఏపీలో జనాభా సంఖ్యా రోజు రోజుకూ తగ్గుతోంది. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉంది. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయి. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరం. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోంది. కొత్త వైద్య కళాశాలల్లో అదనంగా 380 పోస్టులకు ఆమోదం. సున్నిపెంట పంచాయతీకి ఇచ్చిన 208.74 ఎకరాల భూమిని రద్దు చేశాం. ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. శ్రీశైలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కోసం వినియోగించుకుంటాం. ఎక్సైజ్ శాఖపై చర్చించాం. ఎక్సైజ్ శాఖ ఏకీకృత పర్యవేక్షణకు నిర్ణయం. మెరుగైన ఎక్సైజ్ పాలసీ రూపొందిస్తాం. గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తెస్తాం. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ. మద్యం ధరలు తగ్గిస్తాం. గత ప్రభుత్వ మద్యం విధానాల వల్ల రూ.18వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు గత ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండేలా విధానాన్ని రూపొందించిందని మంత్రి వర్గం అభిప్రాయపడింది. 22-ఏ ఫ్రీ హోల్డ్ చేసి గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది. భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం. వివాదంలో ఉన్న రిజిస్ట్రేషన్ల పునః పరిశీలన చేయాలని నిర్ణయం. ఇప్పటివరకు 25వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేశారు. మూడు నెలల పాటు అసైన్డ్, 22-ఏ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపడతాం. 3 నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తాం. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు బుక్కులు ఇస్తాం. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపేయాలని నిర్ణయం”.
Admin
Studio18 News