Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ (కళలు, సాంస్కృతిక ప్రదర్శనల కేంద్రం) వద్ద భారత జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ రాకతో ఫెడ్ స్క్వేర్ వద్ద కోలాహలం మిన్నంటింది. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఫెడ్ స్క్వేర్ హోరెత్తిపోయింది. రామ్ చరణ్ ప్రఖ్యాత 'ఐఎఫ్ఎఫ్ఎం' ఈవెంట్ కు గౌరవ అతిథిగా విచ్చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Admin
Studio18 News