Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు తన చాంబర్ లో ఈరోజు బొత్సతో ప్రమాణస్వీకారం చేయించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను బొత్స మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బొత్సకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసేముందు జగన్ ను బొత్స కలిశారు. బొత్స ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్ పర్సన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, అవంతి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, కడుబండి శ్రీనివాసరాజు, తిప్పల నాగిరెడ్డి తదితరులతో పాటు పలువురు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Admin
Studio18 News