Friday, 14 February 2025 08:32:34 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

CM Chandrababu: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేం: సీఎం చంద్ర‌బాబు

Date : 05 September 2024 11:26 AM Views : 42

Studio18 News - ANDHRA PRADESH / : భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన తెలుగు రాష్ట్రాల‌ బాధితుల‌ను ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులే కాకుండా వివిధ రంగాలకు చెందినవారు త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా రూ. 6కోట్ల భారీ విరాళంతో ఉదార‌త చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మ‌రో రూ.కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.1ల‌క్ష చొప్పున‌ రూ.4 కోట్లు ఇస్తాన‌న్నారు. ఇలా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గొప్ప మ‌న‌సు చాటిన ప‌వ‌న్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌ర‌ద ప్రాంత ప్ర‌జ‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ డిప్యూటీ సీఎంను అభినందించారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప‌వ‌న్‌ను ప్ర‌శంసిస్తూ చంద్ర‌బాబు పోస్ట్ పెట్టారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భారీ విరాళం ఇవ్వ‌డం జ‌న‌సేనాని విశాల హృద‌యానికి అద్దం ప‌డుతుంద‌ని సీఎం కొనియాడారు. ప్ర‌జల‌కు ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేమ‌ని తెలిపారు. "వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నా అభినందనలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణ వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు చేసేందుకు మరో రూ.కోటి ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతుంది. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ క‌ల్యాణ్‌ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు