Saturday, 14 December 2024 02:53:04 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP High Court: రఘురామ కేసులో మాజీ సీఐడీ అధికారికి హైకోర్టులో బిగ్ షాక్

Date : 10 August 2024 12:57 PM Views : 42

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. విజయపాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృష్ణాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజుపై రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనను అరెస్టు చేసిన రోజు రాత్రి సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నం చేశారంటూ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ సహా పలువురిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు. రఘురామను నిబంధనల ప్రకారమే సీఐడీ అరెస్టు చేసి విచారణ జరిపిందని, కస్టడీలో చిత్రహింసలకు గురి చేయలేదని, రఘురామ శరీరంపై గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని విజయపాల్ న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనలను పోలీసుల తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ ఖండించారు. రఘురామకు గాయాలు అయినట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. విజయ్ పాల్‌కు మధ్యంతర మందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు