Thursday, 12 December 2024 12:21:13 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారు: సినీ నటి శ్రియా శరణ్

Date : 08 August 2024 12:27 PM Views : 90

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని ప్రముఖ సినీ నటి శ్రియా శరణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ... ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం దక్కించుకున్నారన్నారు. ఆయన విషయంలో తాను గర్వపడుతున్నానన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగిన వ్యక్తని అన్నారు. అలాంటి జనసేనానిని ప్రజలు ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారని తాను నమ్ముతున్నానన్నారు. ఇద్దరం కలిసి గతంలో 'బాలు' సినిమాకు పని చేశామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా సైలెంట్ వ్యక్తి అని, శ్రమపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైందని, పాట షూట్ పూర్తయ్యే వరకు ఆయన ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు. తన గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం తాను షో టైమ్ అనే కార్యక్రమం కోసం పని చేస్తున్నానని తెలిపారు. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు. అలాగే తేజ సజ్జా సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు భాషతో సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. తనకు భారత చిత్ర పరిశ్రమ అంటే ఇష్టమని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు