Thursday, 05 December 2024 09:50:44 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ

Date : 07 September 2024 03:37 PM Views : 45

Studio18 News - జాతీయం / : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని, కొత్త మద్యం విధానం ద్వారా తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని ఆయన డిమాండ్ చేశారని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాఫ్తు ముగిసింది. ఛార్జిషీట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించడం మొదలు, అమలు చేయాలనే అంశం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని అందులో పేర్కొంది. ప్రతి అంశంలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. తమ పార్టీకి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంలో భాగంగానే ఈ పాలసీని రూపొందించారని, అందుకే కేజ్రీవాల్ సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్ నాయర్ పలువురు వాటాదారులను కలిసినట్లు సీబీఐ తన చార్జిషీట్ లో తెలిపింది. వారు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. మద్యం పాలసీ కుంభకోణం ద్వారా ఆర్జించిన మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లు తెలిపింది. మరో ఇద్దరు నిందితులు వినోద్ చౌహాన్, ఆశిష్ మాధుర్ ద్వారా అక్రమంగా తరలించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ధనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించినట్లు పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించింది. కాగా, ఈ చార్జిషీట్ దాఖలుతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్టయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :