Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పోటెత్తుతోంది.
Admin
Studio18 News