Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, వాటిని పూడ్చే పనులను పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొల్లేరులో కలుస్తుందో ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితిని గమనించారు. అంతేకాదు, బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో కూడా చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని, కృష్ణా నది సముద్రంలో కలిసే చోటును, లంక గ్రామాలను కూడా ఏరియల్ సర్వేలో వీక్షించారు.
Admin
Studio18 News