Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు హైకోర్టులో జగన్ తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. జూన్ 3 నాటికి జగన్‌కి 900 మందితో భద్రత ఉందని జగన్ తరఫు న్యాయవాదులు చెప్పారు. మరమ్మతులకు గురైన వాహనాన్ని జగన్ కు కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్యూరిటీ విజన్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం కుదించింది. తనకు ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్లు జగన్ చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించలేదని అన్నారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని తెలిపారు. కాగా, జగన్ కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాన్నే కేటాయించమని ఇప్పటికే ఏపీ సర్కారు చెప్పిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News