Thursday, 12 December 2024 02:06:49 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Lanka Dinakar: చంద్రబాబు ఏది ప్రకటించినా... మోదీ సహకరిస్తున్నారు: బీజేపీ నేత లంకా దినకర్

Date : 30 August 2024 04:01 PM Views : 52

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చడంతో... త్వరలోనే అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని అమరావతికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఏపీని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు ప్రకటిస్తే... దాన్ని సాకారం చేయడానికి ప్రధాని మోదీ తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా అనేక ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ దెబ్బతిని ప్రభుత్వంపై వెయ్యి కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ హబ్ ల వల్ల రాయలసీమలో దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు