Thursday, 12 March 2026 12:59:55 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: తన ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగిందని ఒక కోటి విరాళం ఇచ్చాడు: సీఎం చంద్రబాబు

Date : 26 July 2024 05:53 PM Views : 329

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ నాయకుడు అయినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. మనం ట్రస్టీలం మాత్రమే... పెత్తందార్లం కాదు అని స్పష్టం చేశారు. ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం... తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ గడచిన ఐదేళ్లలో జరిగింది ఇదేనని అన్నారు. దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పోవడంతో పాటు, రూ.3 లక్షల కోట్ల ఆస్తులు తరిగిపోయాయి అని వివరించారు. "ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగించాలి. అది రైతు పండించే వరి కావొచ్చు... ఫ్యాక్టరీలో తయారయ్యే సూదులు కావొచ్చు. లేకపోతే ఏవైనా వస్తువులు కావొచ్చు, లేకపోతే సేవలు కావొచ్చు. ఏదైనా ముందుకు వెళుతుంటేనే ఆర్థిక క్రియాశీలత పెరుగుతుంది. మొన్న ఒకాయన వచ్చాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ రూ.100 కోట్లు పెరిగింది... అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం ఇస్తున్నాను అని చెప్పాడు. వంద కోట్లు పెరిగాయి కాబట్టి ఉదారంగా ఒక కోటి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ వంద కోట్లు పెరగకపోతే ఈ ఒక్క కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. భూమికి విలువ ఉన్నప్పుడు పిల్లల చదువులకు గానీ, ఆసుపత్రి ఖర్చులకు గానీ ఒక అర ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది" అని చంద్రబాబు వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :