Studio18 News - ANDHRA PRADESH / : కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చించామని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. దాడులను ఆపేలా దేశ వ్యాప్తంగా ఇష్యూను లేవనెత్తుతామని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ దాడుల సంస్కృతిని పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ తమ పార్టీ బలంగా ఉంటుందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయని చెప్పారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టాలని అన్నారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే మరిన్ని దాడులు జరుగుతాయని అన్నారు. రాజకీయ పార్టీలు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. సోమవారం జరిగే అసెంబ్లీలో నిరసన తెలియజేస్తామని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి ఈ దాడుల గురించి వివరిస్తామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ఇలాంటి సంస్కృతి మంచిదికాదని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తామెక్కడా ఇలాంటి దాడులకు పాల్పడలేదని అన్నారు.
Admin
Studio18 News