Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సెల్ఫీ మోజు ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు మహిళను ప్రాణాలతో కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమకాలువ వద్ద ఆగింది. అనంతరం ఆ కుటుంబం కాలువ వద్ద సెల్ఫీ దిగింది. ఈ క్రమంలో ఆ ఫ్యామిలీలోని ఓ మహిళ కాలు జారి కాలువలో పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను తాళ్ల సాయంతో కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Admin
Studio18 News