Monday, 08 December 2025 03:36:32 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Budameru : బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ.. ముమ్మరంగా మూడో గండి పూడ్చివేత పనులు

Date : 06 September 2024 10:52 AM Views : 308

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods : బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. గత ఆరు రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. బుడమేరులో వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో ముంపు ప్రాంతాల్లో వరదనీరు తగ్గుతోంది. మరోవైపు.. ప్రభుత్వం ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందజేస్తుంది. బుడమేరకు గండ్లు పడటం కారణంగానే విజయవాడ నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో గండ్లను పూడ్చేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి రామానాయుడు రాత్రిపగలు తేడాలేకుండా అక్కడేఉండి గుండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కు తెలియజేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ ముంపునకు కారణమైన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు కొనసాగుతున్నాయి. అక్కడే ఉండి ఏజెన్సీలతో మంత్రి రామానాయుడు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేశారు. ఇవాళ తెల్లవారు జామున 3.30 గంటలకు రెండో గండి పూడ్చివేత పనులను పూర్తి చేశారు. వెంటనే మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి దిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది. అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం ఏపీకి రానుంది. హైదరాబాద్ నుంచి 40 మంది ఆర్మీ ఇంజనీరింగ్ బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం గండిపడిన ప్రాంతానికి ఆర్మీ ఇంజనీర్ల బృందం చేరుకుంది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది. ఎట్టిపరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :