Friday, 13 December 2024 08:38:25 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

Date : 13 August 2024 11:39 AM Views : 37

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో సోమవారం ఓ స్కూల్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో సోమవారం శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు విద్యార్ధులు స్వల్పంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె నుండి 20 మంది విద్యార్ధులతో బయలుదేరిన బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్ధిని భవిష్య (8) మృతి చెందింది. ఈ ఘటన అనంతరం గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో డ్రైవర్ అక్కడ నుండి పరారయ్యాడు. అయితే ఈ బస్సును యాజమాన్యం ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు