Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు పులివెందులకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో ఆయన బెంగళూరు నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో పెండ్లిమర్రి మండలం మాచనూరుకి వెళ్తారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబసభ్యులను జగన్ పరామర్శిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో కాసేపు గడిపి గొందిపల్లికి చేరుకుంటారు. కడప మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. కొత్త దంపతులను ఈ సందర్భంగా జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. రాత్రికి పులివెందులలో జగన్ విశ్రాంతి తీసుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు రాత్రికి ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. సెప్టెంబర్ 4న ఆయన లండన్ కు వెళ్లే అవకాశం ఉంది.
Admin
Studio18 News