Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో కేవలం రూ. 5కే టిఫిన్, లంచ్, డిన్నర్ దొరుకుతాయి. మరోవైపు అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎంతో మంది పేదలు తినడానికి తిండి లేక పస్తులు పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపుతున్నామనే సంతోషం తనకు ఉందని చెప్పారు. పేదలకు అన్నం పెట్టే ఈ మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ వంతుగా ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు. అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలు: బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ పేరు - అన్న క్యాంటీన్ అకౌంట్ నెంబర్ - 37818165097 IFSC - SBIN0020541 బ్రాంచ్ - చంద్రమౌళి నగర్, గుంటూరు
Admin
Studio18 News