Monday, 02 December 2024 04:48:58 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Date : 20 August 2024 04:13 PM Views : 63

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్ లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇక, ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు