Thursday, 05 December 2024 04:28:10 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ap floods: నేడు ఏపీకి కేంద్ర బృందం రాక .. బృందంలో ఎవరెవరు ఉన్నారంటే ..!

Date : 05 September 2024 11:57 AM Views : 33

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఈ రోజు (గురువారం) కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డియం అండ్ పియం) సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనుంది. అంతే కాకుండా వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది. ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఏ) సలహాదారు కల్నల్ కెపి సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యుసీ) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసిసి) యం రమేశ్ కుమార్, ఎన్‌డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్న ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు