Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు 800 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం గమనార్హం. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నారని నిర్వాహకులు చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని చెప్పారు. అయితే, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Admin
Studio18 News