Studio18 News - ANDHRA PRADESH / : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను జైలుకు పంపారని, కక్ష సాధింపు చేయాలనుకుంటే తానూ చేయగలనని చెప్పారు. అయితే, కక్ష సాధింపు వ్యవహరాన్ని తాను పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా నడుచుకోవాలని అన్నారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని చెప్పారు. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాలేదని, జగన్ మాత్రం అప్పుడే విమర్శలు మొదలు పెట్టేశారని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. తప్పులు చేసి, ఇతరులపై నెట్టేయడం జగన్ కు అలవాటని అన్నారు. వైఎస్ వివేకానంద మృతి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని తెలిపారు. వినుకొండలోనూ ఇదే జరుగుతోందని అన్నారు. శాంతి భద్రతలలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని ఎమ్మెల్యేలకు చెప్పారు. కాగా, కూటమి మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు.
Admin
Studio18 News