Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని... రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందరం కలసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మనందరం సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే... దానికి ఎందరో పెద్దల ప్రాణ త్యాగాలే కారణమని అన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం అందరం బాధ్యతతో పని చేయాల్సి ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కావాలని... సభలో అర్థవంతమైన చర్చ జరగాలని చెప్పారు.
Admin
Studio18 News