Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Big Shock For Ysrcp : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీమా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు రేపు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ ని కలిసి వారు తమ రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్ రావులు ఢిల్లీకి పయనం అయ్యారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం. త్వరలో వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి, బీదా మస్తాన్ రావు బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి పార్టీని వీడుతున్నామని నేతలు అంటున్నారు.
Admin
Studio18 News