Thursday, 12 December 2024 12:59:53 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: కలెక్టర్లు అల్ రౌండర్లుగా తయారవ్వాలి: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 15 August 2024 05:42 PM Views : 41

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహించారు. ఓ ఆటోడ్రైవర్ వేదికపైకి వచ్చి... డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయని, వచ్చే ఆదాయం మిగలడంలేదని, దానికి దానికి సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ... "నీ ఆటో డీజిల్ ఇంజిన్ ను ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చేయ్... అప్పుడు ఇంధన ఖర్చు తగ్గుతుంది కదా... అలా మార్చొచ్చా... దానిపై నీకేమైనా అవగాహన ఉందా?" అని అడిగారు. ఆ ఆటోడ్రైవర్ బదులిస్తూ... ఇంజిన్ మార్చడంపై తనకు అవగాహన లేదని, కానీ కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. సభలో కూర్చున్న కొందరు... ఆ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ ను ఏర్పాటు చేయవచ్చు అని తెలిపారు. దాంతో చంద్రబాబు "కలెక్టర్" అని పిలిచారు. జిల్లా కలెక్టర్ వేదికపైకి రాగానే... "కలెక్టర్లు ఆల్ రౌండర్లుగా తయారవ్వాలి... ఇలాంటి విషయాల్లో కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి" అని సూచించారు. దాంతో సభలో నవ్వులు విరబూశాయి. "డీజిల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటగా ఈ విధానాన్ని నీ ఆటోతోనే ప్రారంభిస్తా. దాన్ని నువ్వు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు. నువ్వొకసారి కలెక్టర్ ను కలువు... ఏం చేయాలో వారు దిశానిర్దేశం చేస్తాం... దాని ప్రకారం ముందుకెళదాం" అంటూ సీఎం చంద్రబాబు ఆ ఆటోడ్రైవర్ కు హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు