Studio18 News - ANDHRA PRADESH / : Buddha Venkanna : టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కేశినేని చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో రక్తంతో చంద్రబాబుకి అభిషేకం చేసిన నాకు టికెట్ రాలేదు. ఇప్పుడు నేను కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు. సీఐల పోస్టింగ్ లలో ఎమ్మెల్యే చెప్పిన వారికి పని జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో నేను 37 కేసులు పెట్టించుకున్న, నాతోపాటు కార్యకర్తలు, మహిళలపైకూడా కేసులు పెట్టారు. కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యే గా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది. 2029లో ఎలాగైనా సరే పోరాటం చేసి ఎమ్మెల్యేగా నేను టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న అన్నారు. నా దౌర్భాగ్యం ఏమిటంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడమే. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలు వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నేనే స్పందించా. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని తిడితే నేను స్పందించి కౌంటర్ ఇస్తే గన్నవరంలో నాపై కేసు పెట్టారు. చచ్చేంత వరకు చంద్రబాబు నాయుడుతోనే తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్ళినప్పుడు నేనే స్పందించా. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారందరూ అప్పుడు ఏమయ్యారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నికి నా బాధ, కార్యకర్తల బాధ తెలియజేస్తున్నాను. అధిష్టానానికి తెలియజేయాలని బుద్ధా వెంకన్న అన్నారు.
Admin
Studio18 News