Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి-2ను అతి త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది.
Admin
Studio18 News